బడ్జెట్ సమావేశాల్లో పెగసెస్ పై చర్చ

బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలు-దళితులపై నేరాల గురించి పార్లమెంటులో చర్చిస్తామన్నారు. వర్షాకాలం సమావేశాల్లో పెగసస్ పై కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టిందన్నారు ఖర్గే. విపక్షాలు పార్లమెంటు సెషన్ ని కొనసాగించట్లేదని కేంద్రం ఆరోపించింది. కానీ.. నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. పెగసెస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ పబ్లిష్ చేసిందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పెగసెస్ అంశంపై చర్చలను స్వాగతిస్తామన్నారు. పెగసస్ స్పై అంశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో విపక్షాలు ఆలోచించాలన్నారు.