విభజన హామీల అమలుపై పార్లమెంట్‌‌లో ప్రశ్నిస్తా : కాంగ్రెస్‌‌ ఎంపీ మల్లు రవి

విభజన హామీల అమలుపై పార్లమెంట్‌‌లో ప్రశ్నిస్తా : కాంగ్రెస్‌‌ ఎంపీ మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పొందుపరి చిన అంశాల అమలు సాధనకు పార్లమెం ట్‌‌లో పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ఉభయ సభల్లో ప్రశ్నిస్తామన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

అంశాల వారీగా ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి చొరవ పాలని కోరుతామన్నారు. మరోవైపు, లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. అందులో భాగంగా సోమవారం సీఎం, ఎంపీలు రిసెప్షన్‌‌కు హాజరైనట్లు తెలిపారు. 

ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం..

తెలంగాణకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్‌‌ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. మంగళవారం ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్‌‌లోని తన అధికారిక నివాసంలో ఆయన భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇందులో భాగంగా.. రాష్ట్రానికి సంబంధించి కేం ద్రం వద్ద పెండింగ్‌‌లో ఉన్న అంశాలపై ఎం పీలతో చర్చిస్తారు. వీలైతే ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది.