
- ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
న్యూఢిల్లీ : నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మెడి సిన్స్ ధరలను పెంచడంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిది ఔషధాల సీలింగ్ ధరలను ఎన్పీపీఏ 50 శాతం పెంచడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజలపై పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర కమిటీని ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ధరల పెంపునకు దారి తీసిన అసాధారణ పరిస్థితుల గురించి మరింత వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీ వల ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. “ధరల పెంపు ప్రభావం ఆస్తమా, ట్యూబరిక్యూలో సిస్, బైపో లార్ డిజార్డర్, గ్లాకోమా బాధితులపై పడుతుంది. రోగులు, వారి కుటుం బాలు ఇప్పటికే చికిత్సను పొంద డంలో ఆర్థికంగా ఇబ్బందులును ఎదు ర్కొంటున్నాయి. ఔషధాల ధరల ఆక స్మిక పెంపు వీరిపై అదనపు భారాన్ని మోపుతోంది’’ అని మాణిక్కం ఠాగూర్ లేఖలో పేర్కొన్నారు.