అగ్నివీర్, నీట్ రద్దు చేయండి .. కేంద్రానికి చిదంబరం ఐదు డిమాండ్లు

అగ్నివీర్, నీట్ రద్దు చేయండి .. కేంద్రానికి చిదంబరం ఐదు డిమాండ్లు

న్యూఢిల్లీ: దేశంలో అగ్నివీర్ స్కీమ్‌‌ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం కోరారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ముందు కాంగ్రెస్ తరఫున ఐదు డిమాండ్లు ఉంచారు. ఉపాధి పథకంలో కనీస వేతనం రోజుకు రూ.400 చెల్లించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పంటలకు ఎంఎస్‌‌పీ లేదా కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలన్నారు.

2024 మార్చి వరకు విద్యా రుణాల బకాయిలను మాఫీ చేయాలని కోరారు. వివాదాస్పద అగ్నివీర్ మిలిటరీ రిక్రూట్‌‌మెంట్ స్కీమ్‌‌ను రద్దు చేయాలని చెప్పారు. కోరిన రాష్ట్రాలకు మాత్రమే మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్షను నిర్వహించాలని.. మిగతా రాష్ట్రాల్లో రద్దు చేయాలని రిక్వెస్ట్ చేశారు. లోక్‌‌స‌‌భ ఎన్నిక‌‌ల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 2024 మేనిఫెస్టోను కేంద్ర బ‌‌డ్జెట్‌‌లో నిర్మలా సీతారామన్ చదివారని ఎద్దేవా చేశారు.