అడ్వయిజర్లే ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నరు:ప్రియాంకగాంధీ

అడ్వయిజర్లే ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నరు:ప్రియాంకగాంధీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అడ్వయిజర్సే  తప్పుదోవ పట్టిస్తున్నరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాజకీయ కారణాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు దుర్వినియోగం అవుతున్నట్లు ప్రజలందరికీ తెలుసని వెల్లడించారు. దర్యాప్తు పేరుతో తన కుటుంబసభ్యులందరినీ పిలుస్తున్న ఈడీ..  తనను మాత్రం ఎందుకు పిలవట్లేదోనని ఎద్దేవా చేశారు. 

ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు."రాజకీయ కారణాలతో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.  నేషనల్ హెరాల్డ్‌‌‌‌ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు  రూ.2,000 కోట్ల  ఆస్తులను కొట్టేసేందుకు ప్రయత్నించారన్నది  అబద్ధం" అని ఆమె అన్నారు.