టేకాఫ్కు పర్మిషన్ ఆలస్యం.. 45 నిమిషాలు హెలికాఫ్టర్లోనే రాహుల్ గాంధీ

టేకాఫ్కు పర్మిషన్ ఆలస్యం.. 45 నిమిషాలు హెలికాఫ్టర్లోనే రాహుల్ గాంధీ

గొడ్డా: జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)నుంచి అనుమతి రావడం ఆలస్యమైంది. దీంతో.. జార్ఖండ్లోని గొడ్డా జిల్లా మహాగమలో 45 నిమిషాల పాటు హెలికాఫ్టర్లోనే కూర్చుని టేకాఫ్ పర్మిషన్ కోసం రాహుల్ గాంధీ నిరీక్షించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

గొడ్డాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకైలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారని, ఈ ర్యాలీకి ప్రియారిటీ ఇచ్చి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC) రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ టేకాఫ్కు అనుమతిని జాప్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సాగకూడదనే దురుద్దేశంతోనే ఏటీసీ ఆయన హెలికాఫ్టర్ టేకాఫ్కు క్లియరెన్స్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

ప్రధాని మోదీ అక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారన్న ఒకేఒక్క కారణంతో రాహుల్ గాంధీని ఆ ప్రాంతానికి వెళ్లనివ్వడం లేదని మహాగమ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపికా సింగ్ పాండే ఆరోపించారు.  ప్రోటోకాల్ ఉందన్న సంగతి తమకు కూడా తెలుసని, అయినప్పటికీ 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ప్రతిపక్ష నేతను ఇలా అవమానించలేదని, ఏటీసీ ఇలా ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె మండిపడ్డారు.

ALSO READ | ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం

జార్ఖండ్లోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 నియోజకవర్గాలకు ఓటింగ్ ముగిసిన రెండు రోజులకు ఈ పరిణామం జరగడం గమనార్హం. మిగిలిన 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు.