బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్: బడ్జెట్‎పై రాహుల్ రియాక్షన్

బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్: బడ్జెట్‎పై రాహుల్ రియాక్షన్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‎పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‎లో అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేయలేదని.. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆరోపిస్తు్న్నారు. ఈ క్రమంలో 2025 బడ్జెట్‎పై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బడ్జెట్‎పై రియాక్ట్ అయిన రాహుల్ గాంధీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ చికిత్స’’గా 2025 బడ్జెట్‎ను ఆయన అభివర్ణించారు. 

ALSO READ | రూ.8 లక్షల ఆదాయానికి ఇకపై రూ.30 వేల ట్యాక్స్ కట్టక్కర్లేదు: మంత్రి నిర్మలా సీతారామన్

ఆర్థిక సంక్షోభంపై బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఎన్డీఏ సర్కార్ మరోసారి అన్ని వర్గాలను మోసం చేసిందని బడ్జెట్‏పై అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోడీ సైతం బడ్జెట్‎పై స్పందించారు.  ‘‘ఇది ప్రజల బడ్జెట్‌. ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. పొదుపు, పెట్టుబడులకు ఈ బడ్జెట్‌ బూస్ట్‌ ఇస్తుంది. ప్రజలను మిగితా ప్రభుత్వాలు దోచుకుంటే.. మేం వారికి డబ్బు ఇస్తున్నాం’’ అని మోడీ పేర్కొన్నారు.