వరద బాధితులకు సాయం అందించాలంటూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు కాంగ్రెస్ నేతలు. MP రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బాధితులకు వెంటనే సాయం అందించాలన్నారు రేవంత్ రెడ్డి. నిజమైన వారికి సాయం చేయకుండా… టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబ్బులు పంచారని ఫైర్ అయ్యారు.
వరద బాధితుల కోసం రూ. 500 కోట్లు కేటాయించి రూ.250 కోట్లు ఆ పార్టీనేతలు దోచేశారన్నారు రేవంత్ . వరదలతో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు దుర్కొంటున్నారన్నారు. ఎల్బీనగర్ ,కూకట్పల్లి, మల్కాజిగిరి జోనల్ కమిషనర్ లకు బస్తీల వివరాలు ఇచ్చామన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు చెప్పి నిజమైన లబ్ధిదారులకు సహాయం అందేలా పని చేస్తామన్నారు. అపాయింట్ మెంట్ కోసం వస్తే జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ పారిపోయాడన్నారు. రూ. 8860 కోట్ల నష్టం వచ్చిందని మోదికి లేటర్ రాసిన సీఎం.. రూ. 500 కోట్లు కేటాయిస్తే ఏ మేరకు సరిపోతాయన్నారు. నిజమైన లబ్ధిదారులకు పైసలు అందలేదని..టీఆర్ఎస్ దొంగలకు అందాయన్నారు.