కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు  మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతులు పండంచిన శనగలకు మద్దతు ధర ప్రకటించడంతోపాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రాష్ట్రంలో శనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆరుగాలం కష్టంచి పండంచిన పంటకు ధర రాక ఉసూరుమంటున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రైవేటు వ్యయపారులు, దళారుల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ పూర్తిగా దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. శనగకు మద్ధతు ధర రూ.5,100 ఉంది. నిజంగా మద్ధతు ధరకు కొన్నా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో మద్ధతు ధర రాకపోగా క్వింటాల్ కు రూ. 700 నుంచి వెయ్యి వరకు తక్కువ చేసి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వ్యపోతున్నారని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఈ దఫా 3.43 లక్షల ఎకరాల్లో శనగ పండించారని, ప్రస్తుతం పంట చేతికి వస్తోందని, పదిహేను రోజులుగా రైతులు పంటను అముకానికి పెడుతున్నారని ఆయన తెలిపారు. మార్క్ ఫెడ్ జోక్యం లేకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మీరు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు వచ్చిన కాడికి  పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. దళారుల దగాను తట్టుకోలేక నిన్న నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారని ఆయన పేర్కొన్నారు.

మోడీ ప్రాపకం కోసం ఎందుకీ అత్యుత్సాహం…?

దేశంలో కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ఒకవైపు రైతుల ఉద్యమం నడుస్తోంది. సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలుపై స్టే కూడా విధించింది. రైతుల ఉద్యమానికి భయపడి మోడీ సర్కారు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గింది. ఏడాదిన్నరపాటు వ్యవసాయ చట్టాల అమలును వాయిదా వేస్తామని ప్రతిపాదించింది. రైతుల్లో వ్యతిరేకత భయంతో బీజేపీ పాల్సడితే రాష్ట్రాలు కూడా ప్రస్తుతం ఈ చట్టాల అమలుకు సుముఖంగా లేవు. మీరు మాత్రం తెలంగాణలో వ్యవసాయ చట్టాల అమలుపై అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఆ చట్టాలలో నిబంధనలకు అనుగుణంగా…ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయం తీసుకున్నారు. రైతుల పంట కొనడానికి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు అని ప్రకటించారు. ఆ విషయం మీకు ఏడేళ్త తర్వాత ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? మోడీ నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాతే మీకు జ్ఞానోదయం అయిందా? మోడీ, బీజేపీ ప్రాపకం కోసం ఎందుకు ఇంత దిగజారుతున్నారు? మన రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి మోడీని మెప్పించడానికి మీరెందుకు ఇంత తాపత్రయ పడుతున్నారు?

వరి రైతుల్లో ఆందోళన…

మరో 20 రోజుల్లో యాసంగి పంట రాబోతోంది. మీ ప్రకటనలు, చర్యలతో ఇపాటికే రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సారి పంట కొనుగోలు కేంద్రాలు ఉంటాయా ?  లేదా ? ప్రభుత్వం పట్టించుకోకపోతే తమ పరిస్థితి ఏమిటని భయాందోళనలో రైతులు ఉన్నారు. వారి ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని మీరు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది.

ప్రధాన డిమాండ్లు

  • శనగల కొనుగోలు కోసం తక్షణం మార్క్ ఫెడ్ కు ఆదేశాలు జారీ చేయాలి.
  • ప్రైవేటు వ్యయపారులు, దళారుల ప్రమేయం పై పర్యవేక్షణ ఉండాలి.
  • శనగకు కనీసం మద్ధతు ధర రూ.5,100 ఇచ్చినా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కనీసం మద్ధతు ధరకు ఒక రూపాయ తగ్గకుండా ధర చెల్లించేలా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది.
  • మరో 20 రోజుల్లో వరి పంట మార్కెట్ లోకి రాబోతోంది. ప్రకృతి పుణ్యమా అని ఈసారి సుమారు 60 లక్షల ఎకరాలలో రైతులు పంట వేశారు. పంటకు మద్ధతు ధర, కొనుగోళ్లలో ప్రభుత్వ బాధ్యత పై తక్షణమే కార్యాచరణ ప్రకటించాలి.
  • గ్రామాలలో పంట కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించాలి.

పై డిమాండ్ల పై స్పందించకుంటే రైతు ఉద్యమ పర్యవసానాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇట్లు

ఎ రేవంత్ రెడ్డి, ఎంపీ మల్కాజిగిరి మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.

 

ఇవి కూడా చదవండి

‘గేటు దాటి వస్తే జనం తంతారని భయం‘

ప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే

వీడియో: చెల్లిని కొట్టాడని బావను ట్రక్కుకు కట్టి లాక్కెళ్లిన బామ్మర్ది