కాంగ్రెసోళ్లను పోలీసులు బెదిరిస్తున్రు: ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా సాగింది. తమను పోలీసులు వేధిస్తున్నారని సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.