రైతుబంధు విషయంలో కేసీఆర్​వి అబద్ధాలు : ఎంపీ ఉత్తమ్

  • రైతుబంధు విషయంలో కేసీఆర్​వి అబద్ధాలు
  • కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి

మేళ్లచెరువు, వెలుగు :  నామినేషన్లలోపు రైతుబంధు డబ్బులు ఇవ్వాలని తాను రైతుల తరఫున మాట్లాడితే కేసీఆర్ దాన్ని వక్రీకరించి, రైతుబంధు ఆపాలన్నట్లు రాష్ట్రమంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హేమ్లాతండా, ఎర్రవరం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుబంధు విషయంలో తనపై కేసీఆర్​ అసత్య ప్రచారం చేస్తున్నారని, దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓటమి భయం కేసీఆర్​లో మొదలైందని, అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ కూలేదశకు చేరుకుందని, మేడిగడ్డలాగే బీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో కూలిపోవడం ఖాయమని ఉత్తమ్​ విమర్శించారు.