
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించడానికి వచ్చిన సుప్రీంకోర్టు ఎంపవర్డు కమిటీని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీలు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎంపీలు రఘురాంరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఎంపవర్డు కమిటీ సభ్యుడైన వినయ్ లిమైని కలిసి ఈ భూములు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెం. 25 లోని భూమి “కంచ అస్తబుల్ పొరంబోకే సర్కారీ” అని ఉందని తెలిపారు.
అంటే ఇది పక్కాగా ప్రభుత్వ భూమి అని ఎంపీలు కమిటీకి వివరణ ఇచ్చారు. అటవీ శాఖ రికార్డుల ప్రకారం కూడా ఈ భూమిని ఎక్కడ కూడా అటవీ భూమిగా పేర్కొనలేదని కమిటీకి అందజేసిన వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు.