ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : వీరేశం

కట్టంగూర్ (నకిరేకల్)/నార్కట్​పల్లి, వెలుగు:  రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం అన్నారు. గురువారం కట్టంగూరు మండలంలో  ప్రజా ఆశీర్వాద సభలో ,  నార్కట్​పల్లిలో  పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  కట్టంగూరు  మండలంలో మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్  ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ స్కీమ్ లను అమలు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. మాయమాటలు చెప్పే బీఆర్ఎస్ ను నమ్మొద్దని నార్కట్​పల్లిలో అన్నారు.  ​ వివిధ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్  వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుందో చూపించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో బత్తుల ఉషయ్య గౌడ్, కోమటిరెడ్డి అనిల్ రెడ్డి,  అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, దూదిమెట్ల  సత్తయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు  ,  పబ్బతి రెడ్డి వెంకటరెడ్డి,  కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ALSO READ :  తెలంగాణ యుద్ధం మొదలైంది : ఎన్నికల నామినేషన్లు పడ్డాయి