నర్సాపూర్, చిలప్‌చెడ్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు పక్కగా అమలవుతాయని కాంగ్రెస్నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి భార్య శైలజ అన్నారు. మంగళవారం హత్నూర మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పలుగు పోచమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలంలోని రొయ్యపల్లిలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో కూడిన కరపత్రాలు పంచుతూ చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. రొయ్యపల్లితోపాటు, అవంచ,షేర్ ఖాన్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా మంచి స్పందన వస్తోందన్నారు. అన్నివర్గాల వారు బీఆర్ఎస్ పాలనతో విసిగి వేజారి ఉన్నారని, కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తామని హామి ఇస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు
చిలప్ చెడ్ కు చెందిన బీఆర్ఎస్ వార్డు మెంబర్లు నర్సింహ గౌడ్, ఉడుతల శ్రీకాంత్, గొట్టం సంతోష అర్జున్, మాజీ వార్డ్ మెంబర్ కొన్యాల యాదగిరి, ఆంజనేయులు, శ్రీనివాస్ గౌడ్, జూల వెంకటేశం, కిష్ట గౌడ్ తో పాటు 40 మంది యువకులు కాంగ్రెస్‌లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండరి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నర్సాపూర్ కు తరలి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, చిలప్ చెడ్ మాజీ జడ్పీటీసీ చిలుముల శేష సాయి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.