- బీఆర్ఎస్ ఓటమి ఖరారైంది
- బీఆర్ఎస్ నాయకులు గూండాయిజం చేస్తున్నరని ఫైర్
కోల్ బెల్ట్, వెలుగు: ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ఓటమి ఖరారైంది. అవినీతిపరులైన కేసీఆర్, బాల్క సుమన్, బీఆర్ఎస్ గూండాలను జైలుకు పంపిద్దాం” అని అన్నారు. ‘‘బాల్క సుమన్ ఇసుక నిషాలో ఉన్నాడు. అతడికి ఇంకేమీ కనిపించడం లేదు. తాను ఓడిపోతున్నాననే విషయం బాల్క సుమన్‌కు ఇప్పటికే అర్థమైపోయింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు గూండాయిజం చేసే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు అలర్ట్‌గా ఉండాలి. బీఆర్ఎస్లో గూండాయిజం ఉంది కాబట్టే ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే కార్యకర్తలకు, లీడర్లకు గౌరవం ఉంటుంది. బాల్క సుమన్‌కు సరైన గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి” అని పిలుపునిచ్చారు.
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు క్వార్టర్స్ ఇప్పిస్తాం..
జాతికి వెలుగులు పంచేందుకు జీవితకాలం సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసి రిటైర్డ్ అయిన కార్మికులకు ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు పెర్క్స్ పై ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు చేయిస్తామని చెప్పారు. ఆనాడు ఖాయిలా బాటలో ఉన్న సింగరేణి సంస్థకు ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లను అప్పుగా ఇప్పించి కాకా వెంకటస్వామి కాపాడారని గుర్తు చేశారు. ‘‘సింగరేణిలో, పవర్ ప్లాంట్‌లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సిద్దిపేట జిల్లాకు చెందినోళ్లతో భర్తీ చేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే సింగరేణిలో, పవర్ ప్లాంట్ లో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచేందుకు కృషి చేస్తాం” అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ఆరు గ్యారంటీలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ఆ గ్యారంటీల విలువ రూ.25 లక్షలు అని పేర్కొన్నారు.
కేసీఆర్, కవితపై ఫిర్యాదు చేసినా
ALSO READ :- రైతుబంధుపై బీఆర్ఎస్ డ్రామాలు.. నోటిఫికేషన్ ముందే ఎందుకివ్వలేదు : కిషన్ రెడ్డి
చర్యలు తీసుకుంటలె..
కేసీఆర్, కవితపై కేంద్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వివేక్ అన్నారు. ‘‘నా మీద బాల్క సుమన్ ఓ తప్పుడు ఫిర్యాదు చేసిన 48 గంటల్లో రెయిడ్స్ చేశారు. మరి వేల కోట్ల లిక్కర్ దందా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంట్లో ఒక్కసారైనా ఈడీ దాడులు జరిగాయా?’’ అని ప్రశ్నించారు. తనిఖీల పేరుతో ఉదయం 6 గంటలకే ఆఫీసర్లు తన ఇంటి తలుపు కొట్టారని, కక్షపూరితంగానే తన అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విషయం స్పష్టమవుతోందన్నారు. కాళేశ్వరం పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్టు, మోటార్లు మునిగినట్టు ఆధారాలున్నా కేసీఆర్‌పై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘తన చేతిలో ఉన్న ఈడీతో ఎవరినైనా బెదిరించొచ్చని అమిత్ షా అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మంచోళ్లు.. అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోరు. కేసీఆర్‌ను గద్దె దింపే వరకు నా పోరాటం ఆగదు” అని చెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు రామకృష్ణాపూర్, రామగుండంలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయించానని, రామగుండం బ్రిడ్జి పూర్తయిందని.. కానీ బాల్క సుమన్ నిర్లక్ష్యం వల్ల రామకృష్ణాపూర్ పనులు ముందుకుసాగడం లేదని ఫైర్ అయ్యారు.
45 వేల ఉద్యోగాలు కల్పిస్త..
సింగరేణి సహా ఇక్కడున్న సహజ వనరులను వినియోగించుకుని చెన్నూరు నియోజక వర్గంలోని యువతకు 45 వేల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని వివేక్ హామీ ఇచ్చారు. ఏజెన్సీ యాక్ట్ తొలగించి మంద మర్రి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామ న్నారు. ‘‘సింగరేణికి చెందిన సీఎస్సార్, డీఎంఎఫ్టీ నిధులను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తమ నియోజకవర్గాలకు మళ్లించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే, మన నిధులు మనమే వాడుకుని అభివృద్ధి చేసుకుందాం. బాల్క సుమన్ 3వ తేదీ తర్వాత ఏఎస్ఐకి ఫోన్ చేసినా ఎత్తకుండా ఐతది. ఇన్నేండ్లు పోలీసులను వాడుకుని ఇష్టమొచ్చినట్టు చేచిండు” అని ఫైర్ అయ్యారు.