మూడు కేటగిరీలుగా పార్టీ నేతలు: కాంగ్రెస్ కొత్త ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్

మూడు కేటగిరీలుగా పార్టీ నేతలు: కాంగ్రెస్ కొత్త ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సక్యత ను పెంచేందుకు కేటగిరీ విధానాన్ని తీసుకొచ్చారు. పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియపై ఫోకస్ పెట్టిన మీనాక్షి నటరాజన్.. పార్టీలో నేతలను మూడ కేటగిరీలుగా విభజించారు. 

మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నవాళ్లను ఒక గ్రూపుగా.. ఎన్నికల ముందు వేరే పార్టీనుంచి వచ్చిన వాళ్లను మరో గ్రూప్ గా, పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చినవాళ్ళను ఇంకో గ్రూపుగా మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తెలిపారు.