- గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు
హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రం ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ఎన్నారై సెల్కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ జేఏసీ బృందం సన్మానించింది. ఇందుకు సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్బీఎం వినోద్ కుమార్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, తోట ధర్మేందర్, గల్ఫ్ జేఏసీ నాయకులు గుగ్గిల్ల రవిగౌడ్, మచ్చ మల్లికార్జున్, దువాస రామకృష్ణ, కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, షేర్ నర్సారెడ్డి పాల్గొన్నారు.