- మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మేకల రమ్య
కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ ఖాతాలో చేరింది. ఆరో వార్డు కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. గతంలో చైర్‌పర్సన్‌గా ఎన్నికైన విజయలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో కౌన్సిలర్లు ఏప్రిల్ 16న అవిశ్వాసం పెట్టారు. దీంతో ఆర్డీవో శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది హాజరుకాగా, ఐదుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గైర్హాజర్ అయ్యారు.సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు మేకల రమ్యకు మద్దతు తెలపడంతో ఆమె చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది.
ఎన్నికకు ముఖ్యఅతిథులుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డి హాజరై రమ్యను సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు, సపోర్ట్ చేసిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిలర్ల సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమలో వైస్ చైర్‌పర్సన్ మహ్మద్ బేగం, కౌన్సిలర్లు, నర్సింగరావు, శ్రీదేవి, శిరీష, బాలస్వామి, రహీం, నహీం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.