ఆర్టికల్ 370 రద్దుపై పాక్ రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..అమిత్షా ఆగ్రహం

ఆర్టికల్ 370 రద్దుపై పాక్ రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..అమిత్షా ఆగ్రహం

పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తిరిగి వస్తుందని ఖ్వాజా ఆసిఫ్ చెప్పడంతో.. పాకిస్తాన్, కాంగ్రెస్ అజెండాలు, ఉద్దేశం ఒక్కటేనని విమర్శించారు అమిత్ షా. ఆర్టికల్ 370, 35A పై కాంగ్రెస్, JKNC మద్దతు గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రకటన..కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిందన్నారు అమిత్ షా.

Also Read :- చెప్పులు విడిచి రమ్మన్నందుకు డాక్టర్​పై దాడి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, గత కొన్నేళ్లుగా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా చెప్పారు. దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అమిత్ షా అన్నారు. వైమానిక దాడులు, సర్జికల్ దాడులకు రుజువులు అడగడం, భారత సైన్యం గురించి అభ్యంతరకరమైన విషయాలు బహిర్గతం చేయడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్, పాకిస్థాన్  ట్యూన్ ఎల్లప్పుడు ఒకేలా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతుందని అమిత్ షా విమర్శించారు.