- కాంగ్రెస్ ఆదివాసీ గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు
షాద్ నగర్, వెలుగు : ప్రతి అభివృద్ధి పనిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ గిరిజన రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు అన్నారు. బుధవారం షాద్ నగర్ లో ఆదివాసీ గిరిజన రాష్ట్ర కో ఆర్డినేటర్ పి.రఘునాయక్, కాంగ్రెస్లీడర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక కేటీఆర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాత్ర ఉందన్నారు. మూసీ ప్రక్షాళన వ్యవహరంలోనూ బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోందన్నారు.
కులగణన సర్వేను అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే హరీశ్ రావును కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించిన టైంలోనూ బీఆర్ఎస్శ్రేణులు పోలీసులపై దాడులకు తెగబడ్డారని, పోలీస్ స్టేషన్ ముందు హంగామా సృష్టించారన్నారు. తాము దాడులకు దిగడం మొదలుపెడితే బీఆర్ఎస్నేతలు ఎవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. పీసీసీ సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.