మునుగోడులో మండలాలవారీగా ఇంచార్జ్లను నియమించిన కాంగ్రెస్

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన ఆ పార్టీ.. ఇప్పుడు మండలాల వారీగా ఇంచార్జ్లను నియమించింది.నారాయణపూర్ మండల ఇంచార్జ్గా రేవంత్ రెడ్డి, చౌటుప్పల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు భట్టి విక్రమార్క, నాంపల్లి దామోదర రాజనరసింహా, మర్రిగూడ శ్రీధర్ బాబు, చండూరు షబ్బీర్ అలీ, గట్టుప్పల్ వీహెచ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గీతారెడ్డిలను ఇంచార్జ్లుగా నియమించింది. 

అసంతృప్తులకు బుజ్జగింపులు

మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసిన నేపథ్యంలో.. టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నేతలను బుజ్జగించే పనిలో టీపీసీసీ నిమగ్నమైంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన మునుగోడు నేత చెలమల కృష్ణారెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ కి అండగా ఉండాలని కృష్ణారెడ్డి కి రేవంత్ నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా రేవంత్ ఇంటికి వెళ్లారు. నాయకులు అందరూ ఐకమత్యంతో పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని అధిష్ఠానం సూచించింది.