యాదాద్రి/భూదాన్ పోచంపల్లి, వెలుగు: కాంగ్రెస్ హయాంలోనే దేశవ్యాప్తంగా హరిత విప్లవం, అభివృద్ధి సాధ్యమైందని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు నిండిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ‘ఆజాదీ కా గౌరవ్’ పాదయాత్రను అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. బీబీనగర్ వరకూ సాగిన ఈ యాత్రలో ఆయా గ్రామాల ప్రజలను పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది రాజకీయ యాత్ర కాదని, స్వాతంత్ర్య పోరాట యోధులను తలుచుకోవడంతో పాటు వారి గురించి ప్రజలకు వివరించాలన్న ఉద్ధేశ్యంతో పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ లీడర్లు నీలం పద్మ, కల్లూరి రాంచంద్రారెడ్డి, వెంకటస్వామి ఉన్నారు.
స్వాతంత్ర్యం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ..
సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందే.. కాంగ్రెస్‌పార్టీ అని, బీజేపీ తో దేశానికి ఒరిగిందేమీ లేదని డీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న యాదవ్ విమర్శించారు. ఆజాదీ కా అమృత్ గౌరవ్ యాత్ర లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మకూర్(ఎస్), నూతనకల్ మండలాల పరిధిలో పాదయాత్ర నిర్వహించారు. 6 కిలోమీటర్లు జాతీయ జెండాలతో స్వాతంత్ర్య సమర యోధుడు బ్రహ్మ దేవర వెంకన్న తో పాదయాత్ర నిర్వహించారు. గుడిపాటి నర్సయ్య, కందాల వెంకట్ రెడ్డి,శిగ శ్రీనివాస్, తంగేళ్ల లక్ష్మి పాల్గొన్నారు.