చండూరులో గడపగడపకూ కాంగ్రెస్

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఇవాళ చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సాదాసీదాగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల కోసం ఇళ్లకు వెళ్లినప్పుడు ఆడపడుచులకు కానుకగా గాజులు,  కుంకుమ, బొట్టు పాల్వాయి స్రవంతి సమర్పిస్తున్నారు.