హైదరాబాద్, వెలుగు: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి నోటీసులు రాకున్నా.. వచ్చాయని డ్రామాలు ఆడుతున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది. బుధవారం ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘కేటీఆర్.. అధికారం పోయినా నీకు తలపొగరు తగ్గలేదు. జన్వాడ ఫాంహౌస్ లో అబద్ధాల ఫ్యాక్టరీ ఏమైనా పెట్టినవా..? లేదంటే మతిపోయిందా..? ఢిల్లీ పోలీసులు స్వయంగా హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి వచ్చి పార్టీ అధ్యక్షుడికి నోటీసులిచ్చారు.
బీఆర్ ఎస్ నాయకులు బీజేపీతో కలిసి దేశ ద్రోహం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసైనా పద్ధతి మార్చుకుంటే మీ పార్టీకి మనుగడ ఉండేది. ఇలాంటి చిల్లర ఆరోపణలు, అబద్ధాలు చెప్తే తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. లోక్ సభ ఎన్నికల తర్వాత కారును బీజేపీకి తూకానికి అమ్ముకోవాల్సిందే”అని తెలిపింది. ఢిల్లీ పోలీసులు అందించిన నోటీసుల కాపీలను ట్వీట్ కు యాడ్ చేసింది.