
జైపూర్,వెలుగు: జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ లీడర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేడు 139 వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.
ఇదే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపై గ్రామ గ్రామాన ప్రజాపాలన అనే కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమన్నారు. దేశం కోసం పార్టీ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ లీడర్లు ఫయాజ్ , పండుగ రాజన్న, బెజ్జాల సర్పంచి గోపాల్, తిరుపతి రాజు, పాత ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదాన కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జైపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల లో గురువారం 8 మంది యువకులతో కలిసి రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానం చేయడం అంటే ప్రమాదంలో ఉన్న మరొకరికి ప్రాణం ఇవ్వడంతో సమానమన్నారు. .రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా పాలన ప్రారంభమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్య ,పత్తి సురేశ్ , తిరుపతి, విజయ్ తదితరులను అభినందించారు.
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
జన్నారం, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జన్నారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు పంచుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు మోహన్ రెడ్డి, సుభాశ్ రెడ్డి, సయ్యద్ ఫసిఉల్లా, ఇందయ్య, దుమ్మల్ల రమేశ్, ముత్యం రాజన్న పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.