
- బీజేపీపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఫైర్
న్యూఢిల్లీ: మణిపూర్లో ఆర్టికల్ 174 ని బీజేపీ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఆర్టికల్ 174 పేర్కొంటుందని, ఆరు నెలలు దాటినా కూడా మణిపూర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని జైరాం ఆరోపించారు.
రాజ్యాంగాన్ని బీజేపీ ధిక్కరించిందని ఆయన మండిపడ్డారు. ‘‘మణిపూర్లో ఆరు నెలలు దాటినా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ఆదేశించలేదు. తాజాగా ఈనెల 10న అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని గవర్నర్ సమన్లు జారీచేశారు. ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయాయి. అంటే, ఆర్టికల్ 174ను మణిపూర్ లో బీజేపీ సర్కారు ఉల్లంఘించింది. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడమే” అని జైరాం రమేశ్ ఆరోపించారు.