తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు లోక్ సభ ఎలక్షన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాలు సాధించినట్లు.. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు.
సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం బాధ్యతలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. సోనియాగాంధీని తెలంగాణలో పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు.