మే 9 లేదా 10న జిల్లాకు ప్రియాంక, రేవంత్ రెడ్డి రాక

మే 9 లేదా 10న జిల్లాకు  ప్రియాంక, రేవంత్ రెడ్డి రాక

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. జహీరాబాద్ స్థానంపై కాంగ్రెస్​ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎంపీ  స్థానం పరిధిలో  కామారెడ్డి జిల్లా ఓటర్లు కీలకం.  

దీంతో ఈ నెల 6నే ప్రియాంక పర్యటన ఖరారు చేయగా..  శనివారం  షెడ్యూల్ మారినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ నెల 9 లేదా 10న ప్రియాంక గాంధీ, రేవంత్​రెడ్డిలు ప్రచారానికి వస్తారని  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. ఈ సభలకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.