
మంచిర్యాల/నస్పూర్, వెలుగు: మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్‌పార్టీ కైవసం చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్చైర్మన్పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, నస్పూర్మున్సిపల్చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో వారు తమ పదవులు కోల్పోయారు. శుక్రవారం రెండుచోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అంతకు ముందే నస్పూర్వైస్చైర్మన్తోట శ్రీనివాస్ బీఆర్ఎస్పార్టీ సభ్యత్వంతోపాటు తన పదవికి రాజీనామా చేశారు. మంచిర్యాలలో జడ్పీ సీఈఓ నరేందర్, నస్పూర్‌లో ఆర్డీఓ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా గత పదిహేను రోజులుగా క్యాంప్‌లో ఉన్న కాంగ్రెస్కౌన్సిలర్లు ఉదయం 10.30 గంటలకు నేరుగా మున్సిపాలిటీలకు చేరుకున్నారు.
మంచిర్యాలలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా మ్యాజిక్ ఫిగర్19. కాంగ్రెస్‌కు చెందిన 26 మంది సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్సభ్యులు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా రావుల ఉప్పలయ్య(30వ వార్డు), వైస్ చైర్మన్‌గా సల్ల మహేశ్(2వ వార్డు) పేర్లను ప్రతిపాదించగా సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ నుంచి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి నరేందర్ ప్రకటించారు.
అలాగే నస్పూర్‌లో మొత్తం 25 మంది సభ్యులుండగా, మ్యాజిక్ ఫిగర్13. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, ఇద్దరు బీజేపీ సభ్యులు, మరో ఇద్దరు సీపీఐ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. చైర్మన్‌గా సురిమిల్ల వేణు(20వ వార్డు), వైస్ చైర్‌పర్సన్‌గా గెల్లు రజిత(15వ వార్డు)లను ఏక్రగీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి రాములు ప్రకటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన సభలో చైర్మన్లు, వైస్చైర్మన్లను సన్మానించారు.