![చిరంజీవికి కొత్త ఐడీ కార్డు ఇచ్చిన కాంగ్రెస్](https://static.v6velugu.com/uploads/2022/09/Congress-party-issued-a-new-identity-card-for-Megastar-Chiranjeevi_bvU5EBNRDy.jpg)
మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడెంటిటీ కార్డు జారీచేసింది. 2027 వరకు చిరంజీవిని ఏపీసీసీ డెలిగేట్గా గుర్తిస్తూ ఏఐసీసీ కార్డు జారీచేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. కానీ రాజకీయం తన నుంచి దూరం కాలేదంటూ ఇటీవలె వాయిస్ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ సోషల్ మీడియాలె వైరల్ గా మారింది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ ఐడెంటిటీ కార్డును జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022