చెక్ డ్యాం కు భూమిపూజ చేపిన కాంగ్రెస్ పార్టీ నేత

చెక్ డ్యాం కు భూమిపూజ చేపిన కాంగ్రెస్  పార్టీ నేత

మద్దూరు, వెలుగు: మండలంలోని పల్లెగడ్డ వీరన్నగుట్ట సమీపంలో రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం కు కాంగ్రెస్  పార్టీ కొడంగల్ నియోజక వర్గ ఇన్ చార్జి ఎనుముల తిరుపతి రెడ్డి శుక్రవారం భూమిపూజ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్యాం నిర్మాణంతో ఈ ప్రాంతంలో గ్రౌండ్  వాటర్  పెరగడమే కాకుండా, పర్యాటకంగా అభివృద్ది చెందుతుందన్నారు. 

అంతకుముందు గ్రామ సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇరిగేషన్  ఆఫీసర్  చక్రధరమ్, ఈఈ జోశమ్, డీఈ శ్రీనివాసులు, జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్, లీడర్లు నర్సింలు, రాజశేఖర్, శివరాజ్, రవి, వెంకటయ్య పాల్గొన్నారు.