కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

ఆర్మూర్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి ఉట్కురి నరేందర్​ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆర్మూర్​లో శుక్రవారం కాంగ్రెస్​పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు.

 మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ భూక్యాతో కలిసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రిటైర్డ్​ఎంప్లాయిస్​ తో, విజయ్​ హైస్కూల్​లో వేర్వేరుగా మీటింగ్​లు ఏర్పాటు చేసి కాంగ్రెస్​పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​సాయిబాబాగౌడ్​, కాంగ్రెస్​ పార్టీ నాయకులు మోత్కురి లింగాగౌడ్​, కొంతం మురళీధర్​, పండిత్​ పవన్​తదితరులు పాల్గొన్నారు.