- కవిత బెయిల్‌పై కాంగ్రెస్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందాల్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. దీంతో ఆ రెండు పార్టీల బంధం బయటపడిందని పేర్కొన్నారు. జడ్జి చెప్పాల్సిన తీర్పును బీఆర్ఎస్ చెప్పేసిందని, కవితకు బెయిల్ వస్తుందని ముందే చెప్పిన కేటీఆర్ పై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కవిత కడిగిన ముత్యం కాదని పలువురు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారు.
సిసోడియాకు రాని బెయిల్కవితకు ఎలా వచ్చింది?
బీజేపీ, బీఆర్‌ఎస్, ఒప్పందాల్లో భాగంగా నే కవితకు బెయిల్ వచ్చింది. 17 నెలల వరకు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు రాని బెయిల్.. లిక్కర్ మాఫియా కింగ్ కవితకు ఐదు నెలలకే ఎలా వచ్చింది? తెలంగాణలో కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్రలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయి. వచ్చే ఎన్నికలలోపు ఆ రెండు పార్టీలు విలీనం కావొచ్చు. లేదా పొత్తు పెట్టుకోవచ్చు. కవితకు బెయిల్ కోసంఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించి. మాకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోవడమే కారణం.
- జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే..
కవిత బెయిల్‌తో బీఆర్ఎస్, బీజేపీ బంధం బయటపడింది. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కవితకుబెయిల్ వస్తుందని వారం కిందటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పినట్టే కవితకు బెయిల్ వచ్చింది. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలి ఉంది. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించింది. తెలంగాణలో చేసిన అవినీతికి కూడా కల్వకుంట్ల కుటుంబం త్వరలో శిక్ష అనుభవించక తప్పదు.
- సామా రామ్మోహన్ రెడ్డి,పీసీసీ మీడియా కమిటీ చైర్మన్
రాత్రి ఢిల్లీలో డీల్..ఉదయం కవితకు బెయిల్
సోమవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ నేతలతో బీఆర్ఎస్ నేతలు డీల్ కుదరడంతోనే మంగళవారం ఉదయం కవితకు బెయిల్ వచ్చింది. కేటీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి పోయిందే బీజేపీ నేతలతో డీల్ కుదుర్చుకొని కవితకు బెయిల్ ఇప్పించడానికి. ఈ రెండు పార్టీల మధ్య కుదరిన లోపాయికారి ఒప్పందం ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకు వచ్చిన బెయిల్‌తో స్పష్టమైంది. ఆ రెండు పార్టీలు విలీనం కావడం ఖాయం.
- ఈరవత్రి అనిల్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్
బెయిల్ వచ్చినంత మాత్రానకవిత కడిగిన ముత్యం కాదు
కవితకు బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమె కడిగిన ముత్యం కాదు. బీఆర్ఎస్ నేతలు ఒక రోజు ముందే ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరపడంతోనే కవితకు బెయిల్ వచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో తమ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వీని తప్పుపట్టడం సరైంది కాదు. గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మజ్లీస్ అగ్రనేతలు ఒవైసీ సోదరుల కేసు వాదించారు. మరి బీజేపీ మజ్లీస్‌తో అంటకాగిందని అనుకోవాలా..?
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి