కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్‌పార్టీ నేతలు విమర్శించారు. కాంగ్రెస్అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్‌లతో పాటు, పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ నేత కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిన బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏండ్లు కావొస్తున్నా ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు.
కాంగ్రెస్అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని, రూ.500 లకే గ్యాస్‌సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కరెంట్ఫ్రీగా ఇస్తామన్నారు. రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు రూ.12,000 అందజేస్తామన్నారు. అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీ
దోమకొండ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, విండో డైరెక్టర్మధుసూధన్రెడ్డి గురువారం కరీంనగర్లో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా గెలిచిన తిర్మల్‌గౌడ్ కొన్నాళ్ల కింద బీఆర్ఎస్లో చేరారు. మళ్లీ రేవంత్‌రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు కొండల్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో భిక్కనూరు, మాచారెడ్డి, కామారెడ్డి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. భిక్కనూరు మండలం తిప్పాపూర్‌కు చెందిన పలువురు రైతులు చేరారు. కామారెడ్డి టౌన్‌కు చెందిన రంగు రమేశ్‌గౌడ్‌ను డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు, నాయకులు కొండల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చర్చి ఫాస్టర్లతో సమావేశమై తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయా మండలాలు, టౌన్ లీడర్లు పండ్ల రాజు, భీమ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గొనే శ్రీనివాస్, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే బలహీన వర్గాలకు మేలు
కాంగ్రెస్ తోనే బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అన్నివర్గాల వారిని అణచి వేసి దొర పాలన కొనసాగిస్తున్నారన్నారు. దీన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పద్మశాలీలకు కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందన్నారు. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్శ్రీనివాస్రావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, లీడర్లు కొండల్‌రెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, వెంకటనారాయణ, గోపాల్, శివరాం, శంకర్పాల్గొన్నారు.