అనాథాశ్రమంలో కాంగ్రెస్ లీడర్ల పండ్ల పంపిణీ

గోదావరిఖని, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్​ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్​ యువ నేత గడ్డం వంశీకృష్ణ–రోష్నీ దంపతుల పెండ్లి రోజు సందర్భంగా శుక్రవారం గోదావరిఖని విఠల్​నగర్​లోని అమ్మ పరివార్ అనాథాశ్రమంలో పార్టీ లీడర్లు కేక్​ కట్​ చేసి పిల్లలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర నాయకుడు గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ వంశీకృష్ణ రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తాత కాకాకు తగిన మనవడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మగ్గిడి దీపక్​, పంజా శ్రీనివాస్, గడ్డం మధు, భీమ్ సందేశ్, నాగరాజు, పాల్గొన్నారు.