బోధన్, వెలుగు: బోధన్ మండలంలోని హున్నా, ఖజాపూర్, మందర్నా గ్రామాలలో మంగళవారం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆ పార్టీ పీసీసీ డెలిగేట్గంగాశంకర్ మాట్లాడుతూ.. ఈనెల 28న ఎడపల్లి మండలం సరయూ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి రైతులతో సమావేశం నిర్వహిస్తారన్నారు.
ఈ సమావేశంలో రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి చెరకు పండించే రైతులు హాజరు కావాలన్నారు. సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు.