లింగంపేటలో కాంగ్రెస్​ నాయకుల పాదయాత్ర

లింగంపేటలో కాంగ్రెస్​ నాయకుల పాదయాత్ర

లింగంపేట, వెలుగు : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లింగంపేటలో కాంగ్రెస్​ పార్టీ లీడర్లు పాదయాత్ర చేపట్టారు. ముందుగా మత్తడి పోచమ్మ ఆలయంలో  పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు  బుర్ర నారాగౌడ్​ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కాంగ్రెస్​శ్రేణులు మండల కేంద్రంలోని శ్రీరామాలయం నుంచి మత్తడి పోచమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు.

డైనమిక్​ ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు - జిందాబాద్,  రావాలిరావాలి - మదనన్నకు మంత్రి పదవి రావాలి అంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రను కొనసాగించారు.  కార్యక్రమం లో కాంగ్రెస్​పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్,  భవానీపేట,శెట్పల్లి, మెంగారం,మోతె, ముస్తాపూర్, ఐలాపూర్, ముంబాజీపేట, ఎల్లారం, పోల్కంపేట, పోతాయిపల్లి, కోమట్​పల్లి, బోనాల్, కొర్పోల్, బానాపూర్ గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.