తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపురానికి చెందిన సంకే పల్లవి గేట్ ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో 104వ ర్యాంకు సాధించింది. ఈ నెల 4న నిర్వహించిన ఆన్లైన్కౌన్సిలింగ్ లో బాంబే ఐఐటీలో సీట్వచ్చింది. కళాశాలలో చేరేందుకు ఫీజు రూ.70 వేలు చెల్లించాల్సి ఉంది. ఫీజు కట్టేందుకు ఆర్థిక స్తోమత లేదని, దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రయువజన విభాగం ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య, ములుగు జిల్లా సీనియర్ నాయకులు బాదం ప్రవీణ్ సోమవారం నార్లపురం చేరుకొని, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిన పల్లవిని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఆమె కాలేజ్ఫీజు కోసం కావాల్సిన రూ.70 వేలు అందజేశారు. పల్లవి చదువులకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని కాంగ్రెస్రాష్ర్ట యువజన ప్రధాన కార్యదర్శి సూర్య హామీ ఇచ్చారు. వారివెంట మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేం లచ్చు పటేల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.