‘‘దేశ ప్రజల గుండె చప్పుడు ను తమ పార్టీ ప్రతిధ్వనిస్తోంది. సామాన్య జనం ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడానికే కాంగ్రెస్ కృషి చేస్తుంది. ఇందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో . అవాస్తవాలనే నమ్ముకున్న నరేంద్ర మోడీ పార్టీకి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం’’. ఈ మాటలన్నది కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఒక ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ అనేక రాజకీయ, సామాజిక అంశాలపై పార్టీ వైఖరిని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేల విడిచి సాము చేస్తోంది. కీలక అంశాలైన నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ కావాలని పక్కకు పెట్టింది. సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఇంతటి ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లిం చడానికి ‘దేశభద్రత’ పేరుతో కొత్త నాటకానికి బీజేపీ తెరలేపింది. అయితే కీలక అంశాలను గాలికొదిలేసి మోడీ టీం దేశ భద్రత అంశాన్ని తెరమీదకు ఎందుకు తీసుకువచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు మన ప్రజలు. కొలువులు దొరక్కపోవడంతో చదువుకున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎన్డీయే సర్కార్ పై వాళ్లు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో ని రుద్యోగం పెరిగింది. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రధాని మోడీ సిద్ధంగా లేరు.
‘దమ్ దార్’ సర్కార్ అంటే ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోడీ తరచూ తన ప్రసంగాల్లో ‘దమ్ దార్ సర్కార్ (బలమైన ప్రభుత్వం)’ అంటూ ప్రస్తావిస్తుంటారు. ఇండియా బలోపేతం అయిందంటే అందుకు కారణం యువతే. వీరి కంట్రిబ్యూషన్ వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్న విషయం మరువకూడదు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల సత్తా మన యువతకు ఉందన్న విషయం అందరూ తెలుసుకోవాలి. ‘దమ్ దార్ సర్కార్’ ఉండాలంటే ముందు చేయాల్సిన పని యువతకు వారి సామర్థ్యానికి తగ్గ ఉద్యోగాలు కల్పించడం. ఈ విషయంలో మోడీ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రధాని ఊకదంపుడు ఉపన్యా సాలతో దేశం బలోపేతం కాదు. అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తానని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన మోడీ… ప్రధాని అయ్యాక ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయారు. మోడీ తనను దేశానికి ‘చౌకీదార్ (కాపలాదారు)’గా చెప్పుకుంటుంటే ప్రజలు అయనను ‘చోర్ హై (దొంగ)’ అంటున్నారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ రా ష్ట్రానికి వెళ్లి చౌకీదార్ అనగానే ప్రజలందరూ ఒకేసారి ‘చోర్ హై’ అంటున్నా రు. ఎన్నికల ముం దు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మని హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ హామీని ని లబెట్టుకోలేకపోయారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయాం . పెద్ద నోట్ల రద్దు ఓ తెలివితక్కువ నిర్ణయం. అలాగే మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన జీఎస్ టీలో అన్నీ లోపాలే ఉన్నాయి. దీని పుణ్యమా అని సామాన్యులు హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జీఎస్ టీ పేరు చెప్పి వ్యాపారులు ఎడాపెడా రేట్లు పెంచేశారు.
ఊబిలో వ్యవసాయ రంగం
ఎన్డీయే సర్కార్ అవలంబించిన విధానాల ఫలితంగానే వ్యవసాయ రంగం ఇవాళ ఊబిలో కూరుకుపోయింది. రైతుల ప్రయోజనాలు కాపాడటంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే వాటికి గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయింది. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో ఫెయిలవడం వల్లనే ‘దేశ భద్రత’ అంశాన్ని మోడీ టీం తెర మీదకు తెచ్చింది. రైతుల విషయానికొస్తే రెండో ‘గ్రీన్ రి వల్యూషన్’కు వారిని రెడీ చేయాలి. వ్యవసాయ రంగం ఎంతగా లాభదాయకమైతే దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ‘దమ్ దార్ సర్కార్ ’ అని గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు.
అన్ని సమస్యలకు మేనిఫెస్టోనే సమాధానం
దేశంలోని అన్ని సమస్యలకు కాం గ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో సమాధానాలు సిద్ధం చేసింది. అన్ని వర్గాల ప్రజలతో ఇంటరాక్ట్ అయిన తర్వాతే మేనిఫెస్టో తయారు చేశాం. సామాన్య ప్రజలు, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు, కాలేజీ స్టూడెంట్స్ ఇలా అందరితో కాంగ్రెస్ పార్టీ ఇంటరాక్టయింది. వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు తగ్గట్టు మేనిఫెస్టోను రూపొందించాం. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ‘ఈజ్ ఆఫ్ బి జినెస్’కి కొత్త నిర్వచనం ఇస్తాం. ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మొదటి మూడేళ్లు ఉచితంగా పర్మిషన్ ఇస్తాం. రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెడతాం.
రాఫెల్ ఇష్యూ జనంలోకి వెళ్లింది
రాఫెల్ ఇష్యూ ఇదివరకే ప్రజల్లోకి వెళ్లింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ప్రజల సొమ్ము 30 వేల కోట్ల రూపాయలు ప్రధాని మోడీ కట్టబెట్టారన్న విషయం అందరికీ తెలిసిందే. రాఫెల్‌కి కౌంటర్ గా అగస్టా వెస్ట్ ల్యాండ్ కేస్ ని మోడీ బయటకు తీశారు. మా కుటుం బానికి కుంభకోణాలతో సంబంధం ఉంటే ప్రధాని హోదాలో మోడీ విచారణకు ఎందుకు అదేశాలు ఇవ్వలేదు. సాక్షాత్తూ తన ప్రమేయం ఉందన్న విషయం మోడీకి తెలుసు. కాబట్టే, రా ఫెల్ ఇష్యూపై మౌనంగా ఉంటున్నారు. అవినీతిపై నాతో బహిరంగ చర్చకు రావలసిందిగా చేసిన సవాల్‌ని ఇప్పటికీ మోడీ అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాఫెల్ డీల్‌పై విచారణ జరుపుతుంది.
చెప్పింది… చేసి చూపాం
ఎన్నికల హమీలను నెరవేర్చడంలో కాం గ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రా ష్ట్రా ల్లో రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. సమాచార హక్కుతో ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత వచ్చింది. ఆ ఆర్ టీఐ యాక్ట్‌ని తెచ్చింది కాం గ్రెసే. అలాగే పేద ప్రజల కోసం ‘న్యాయ్’ పథకాన్ని రూపొందించాం. 14 కోట్ల మందిని పేదరికం నుం చి యూపీఏ సర్కార్ బయటకు తీసుకువస్తే… వాళ్లను మరలా పేదలుగా మార్చిన ఘనత ఎన్డీయే సర్కార్ ది. దేశవ్యాప్తంగా పాతిక కోట్ల మంది పేదవారి బతుకుల్లో వెలుగులు నింపడానికే ‘న్యాయ్’ పథకాన్ని తీసుకువచ్చాం. ‘న్యా య్’ పథకాన్ని ఆషామాషీగా రూపొందిం చలేదు. ఆర్థిక రంగంలోని పుణులతో అన్ని విషయాలు చర్చించిన తర్వాత ‘న్యాయ్’కు రూపకల్పన చేశామన్నారు. ఈ పథకం సక్సెస్ ఫుల్‌గా అమలైతే సమాజంలో గొప్పోళ్లు, పేదల మధ్య ఉన్న తేడా చాలావరకు తగ్గిపోతుంది.