స్థానికులకే బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి.. నియోజకవర్గ మండలాధ్యక్షుల డిమాండ్

కోటగిరి,వెలుగు: బాన్సువాడ కాంగ్రెస్ టికెట్​స్థానికులకే కేటాయించాలని టీపీసీసీ, ఏఐసీసీ నాయకులకు బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. వీరు మంగళవారం కోటగిరిలో  సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎలక్షన్​లో బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ రేసులో స్థానికేతరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టికెట్​ కోసం అప్లయ్​చేసుకున్న 16 మందిలో ఒకరికి కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉండి పార్టీ ఉనికిని కాపాడిన వారికే టికెట్ ఇవ్వాలన్నారు. 

గతంలో కాంగ్రెస్ నుంచి బాన్సువాడలో గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్, తర్వాత ఎన్నికల్లో ఓడిపోగానే ప త్తాలేకుండా పోయారని మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసే స్థానిక నాయకులను గుర్తించాలని కోరారు.16 మందిలో ఎవరికి టికెట్ ఇచ్చినా, అందరం కలిసి బాన్సువాడ గడ్డపై పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో  బాన్సువాడ, కోటగిరి, రుద్రూర్,మోస్రా, బీర్కూర్,చందుర్, వర్ని మండలాధ్యక్షులు షాహిద్, గణేశ్, అరుణ్, సురేశ్, లక్ష్మణ్, శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్, గంగాధర్ దేశాయి

 పాల్గొన్నారు.