బీఆర్ఎస్ సర్కార్​కు పిండ ప్రదానం

చెన్నూరు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని వాగు ఒడ్డున బీఆర్ఎస్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పిండప్రదానం చేసింది. కౌలు రైతులను ఆదుకోకుండా చోద్యం చూస్తున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుకు నిరసనగా ఈ  కార్యక్రమం నిర్వహించినట్లు టీపీసీసీ డాక్టర్స్ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ దాసారపు శ్రీనివాస్ తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  ప్రజలు కష్టాలను దూరం చేస్తామన్నారు.