పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకు తమ పార్టీ నిత్యం పోరాటాలు సాగిస్తుందని ఆయన హెచ్చరించారు. టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలను కొనసాగించాలని రేవంత్ అన్నారు. ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు కొనసాగించాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి వరి గింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనగా ఉద్యమాలు చేయాలని రేవంత్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ సమస్యను పక్కదారి పట్టించకుండా, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు.
పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు
- తెలంగాణం
- April 6, 2022
లేటెస్ట్
- Union Budget 2025-26 Live updates : కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
- ట్రిబ్యునల్ ఉత్తర్వులు పాటించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
- రోడ్డు ప్రమాదాలను నివారించాలి
- పవర్ ప్లాంట్ పనులను ప్రారంభించండి.. సీఎంను కోరిన రామగుండం ఎమ్మెల్యే
- కౌకుంట్లలో సౌలతులు కల్పిస్తాం : జి.మధుసూదన్ రెడ్డి
- ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
- కేయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ రాంచంద్రం
- ధర్మపురి మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్..ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- గుడిసెలోకి దూసుకెళ్లిన కారు.. నాలుగేళ్ళ బాలుడు మృతి..
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- గ్రామాల వారీగా రైతుభరోసా లిస్ట్..రోజు విడిచి రోజు నగదు బదిలీ
- అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి శవంతో ఇంట్లోనే వారం రోజులు..
- Prabhas Imanvi: ప్రభాస్ ఇంటి భోజనానికి 'ఫౌజీ' హీరోయిన్ ఫిదా.. వీడియో పోస్ట్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్
- Champions Trophy 2025: మిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. పాకిస్థాన్ జట్టు ప్రకటన
- Meenakshi Chaudhary: శ్రీశైలంలో మీనాక్షి చౌదరి.. స్వామి సేవలో హీరోయిన్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు