నన్నెవరూ అవమానించలేదు..ఎవరికింద ఉద్యోగిని కాదు

నన్నెవరూ అవమానించలేదు..ఎవరికింద ఉద్యోగిని కాదు

హైదరాబాద్:  సీఎల్పీ సమావేశాన్ని  బాయ్ కాట్  చేసి  వెళ్లిపోయారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  ఎమ్మెల్యే జగ్గారెడ్డి.  పార్టీ  పరిస్థితిపై సీఎల్పీ సమావేశంలో  చర్చించాలని అనుకున్నా..  అయితే భట్టి విక్రమార్క,  కుసుమ కుమార్ ల  సూచన మేరకు ఇక్కడ  మాట్లాడవద్దని  నిర్ణయించుకున్నానన్నారు.  అందుకే  సమావేశాన్ని వీడుతున్నానని చెప్పారు.  రేపు సోమవారం నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ నిర్వహించారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని భట్టి విక్రమార్కతోపాటు కుసుమకుమార్ సూచించడంతో జగ్గారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు అవమానాలు జరిగాయని.. ఇప్పుడూ జరుగుతున్నాయని పేర్కొంటూ సమావేశాన్ని బాయ్ కాట్ చేసి వెళ్లిపోతున్నానని చెప్పారు. తనను ఎవరూ  అవమానించలేరని.. తాను  ఎవరికింద  ఉద్యోగిని  కాదన్నారు జగ్గారెడ్డి. 

 

 

ఇవి కూడా చదవండి

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు

ద్వేషాన్ని జయిస్తే ప్రపంచమంతా మన వెనకే

కుకింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌: నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది