సీఎం పర్యటనకు ఏర్పాట్లు

సీఎం పర్యటనకు ఏర్పాట్లు
  • ఈ నెల 25న ఏడుపాయలకు సీఎం రేవంత్ రెడ్డి 
  • విజయవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు 

పాపన్నపేట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు , మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఈ నెల 25న సీఎం జిల్లా పర్యటన పురస్కరించుకొని శనివారం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.  అమ్మవారి దర్శనం అనంతరం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ..  ఏడుపాయల ఆలయ అభివృద్ధి,  జిల్లాలోని అభివృద్ధి పనుల నిధుల గురించి  సీఎం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో మాట ఇచ్చిన సందర్భంగా సీఎంను ఏడుపాయలకు తీసుకు వస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిలు శ్రీనివాస్ రెడ్డి,  పూజల హరికృష్ణ, నాయకులు సుప్రభాతరావు, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్, రమేశ్ గుప్తా,ఆకుల శ్రీనివాస్​, నర్సింలు, నరేందర్, శ్రీకాంత్, తదితరులున్నారు

పటిష్ట బందోబస్తు..ఎస్పీ ఉదయ్​కుమార్​

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ఏడుపాయల్లో  పటిష్ట ఏర్పాట్లు చేయాలని  జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సీఎం దర్శనం చేసుకునే ప్రాంతం, పార్కింగ్ స్థలం, హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. బందోబస్తు విషయంపై అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.