కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే రైతుబంధును ఆపిందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం ఆ పథకాన్ని ఎత్తగొట్టరా అని ప్రశ్ని్ంచారు. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్‌లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. దేశంలో రైతుబంధును పరిచయం చేసిందే సీఎం కేసీఆర్ అని అన్నారు.
ALSO READ :- ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలె: వివేక్ వెంకటస్వామి
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతును నొక్కాలని దిల్లీ పెద్దలు చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్, రైతుబంధు ఆగిపోతాయని చెప్పారు కేటీఆర్. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.
నవంబర్28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ ఎదురైనట్టయింది.