- ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- వంశీకి మద్దతుగా ప్రచారం
గొల్లపల్లి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గొల్లపల్లి మండలకేంద్రం, చందోలి లో శనివారం ఆయన వంశీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే నాలుగు హామీలను అమలు చేసిందని, మిగితా హామీలను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేస్తామన్నారు.
గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి కి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ సర్పంచ్ శనిగరపు మల్లేశం అయన అనుచరులు 50 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరగా ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీబీరాజ్ పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రావు, ఎంపీటీసీ ధనవ్వ లక్ష్మణ్, లీడర్లు తాండ్ర సురేందర్, భీమా సంతోష్, అరవింద్ గౌడ్, బుచ్చి రెడ్డి, సత్యనారాయణ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.