అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ: మంత్రి హరీష్రావు

జనగామ: అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ మారిందని అని విమర్శించారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటోంది... ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆరోపించారు.  వందసీట్లను కాంగ్రెస్ ప్రకటిస్తే.. నూటొక్క ధర్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గాంధీభవన్లో రాళ్లు, రప్పలతో కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహుల చేతులోకి వెళ్లిందని అన్నారు.. అవినీతి పరులు చేతులోకి వెళ్లిపోయిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి పరులే కాంగ్రెస్ పార్టీ తరపును బరిలోకి దిగుతున్నారు.. ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే అమ్ముకుంటారని అన్నారు మంత్రి హరీష్ రావు.. 

సొంత ఊళ్లో గెలవలేనోళ్లు కేసీఆర్ మీద పోటీ చేస్తామని సవాల్ విసురుతున్నారు.. కూట్ల రాయి తీయనోళ్లు.. ఏట్ల రాయి తీస్తానని వచ్చిండట.. అని హరీష్ రావు విమర్శించాడు. కామారెడ్డిలో పోటీచేస్తా.. సిరిసిల్ల లో పోటీ చేస్తా.. సిద్దిపేటలో పోటీ చేస్తా.. అని కొంతమంది ప్రగల్బాలు మాట్లాడుతన్నారు.. సొంత నియోజకవర్గాల్లో గెలవడానికి చేతగాని వారు వచ్చి పోటీ చేస్తారంట.. పోటీచేసేందుకు అభ్యర్థుల లేక కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.