కాంగ్రెస్ 2024 మేనిఫెస్టో : ఏపీలో విలీనం అయిన 5 గ్రామాలు వెనక్కి తెస్తాం

కాంగ్రెస్ 2024 మేనిఫెస్టో : ఏపీలో విలీనం అయిన 5 గ్రామాలు వెనక్కి తెస్తాం

పార్లమెంట్ ఎన్నికలు 2024కు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అభివృద్ధి దిశగా హామీలు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు అదనంగా.. ఈ హామీలను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇందులో కీలకమైన ఓ హామీని చూద్దాం..

భద్రాచలం రాములోరి ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు అయిన ఏటపాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలోకి తిరిగి తీసుకురావటం వల్ల భ్రదాచలంను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేయటం వల్ల.. భద్రాచలం దేవాలయం అభివృద్ధికి అడ్డంగా ఉందని వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. 

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఇది సాధ్యమే అంటూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.