పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జమాతే ఇస్లామీ హింద్ సంస్థ గురువారం నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమాతే ఇస్లామీ హింద్ ఆద్వర్యంలో సర్వమత సమ్మేళనం పెంపొందించడం గర్వకారణం అన్నారు.
రంజాన్ ఉపవాసాల తర్వాత వచ్చే ఈద్ మిలాప్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం మంచి సంప్రదాయమన్నారు. తన తలపై పెట్టుకున్న టోపీని చూసుకుంటే తన తాతా కాకా వెంకటస్వామి గుర్తుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఏహెచ్ జావిద్, ముజమ్మిల్ ఇర్ఫాన్, మొయిద్, ఖాజా మజారుద్దీన్, వజాయతుల్లా అయాజ్, జావిద్, ఎలువాక రాజయ్య, మస్రత్, సయ్యద్ సజ్జాద్ పాల్గొన్నారు.