హిమాచల్ ప్రదేశ్ కాబోయే సీఎం ఎవరనేది తేలిపోయింది. పార్టీ సీనియర్ నేత, హిమాచల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో సుఖ్విందర్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారు. రేపే (ఆదివారం) సీఎంగా సుఖ్విందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన రాష్ట్రంలోని నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు.
ఇక డిప్యూటీ సీఎం పదవికి ముకేశ్ అగ్నిహోత్రిని ఎంపిక చేశారు. ఈయన గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించారు. ముకేశ్ అగ్నిహోత్రి హరోలీ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు.